ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (10:51 IST)

ఢిల్లీ రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు... అమర జవానులకు ప్రధాని మోడీ ఘననివాళి

ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గంలో భారత 68వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సైనిక కవాతు ప్రారంభమైంది. ఈ వేడులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,

ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గంలో భారత 68వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సైనిక కవాతు ప్రారంభమైంది. ఈ వేడులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్య అతిథిగా అబూదాబి రాజు, యూఏఈ వ్యవస్థాపక అధ్యక్షుడి కుమారుడు షేక్ మహ్మద్ బిన్ జియాద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. 
 
ఈసారి భారత సైనికులతో పాటు 179 మంది యూఏఈ సైనికులు కవాతు చేయడం గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకరర్షణగా నిలిచింది. వీరితో పాటు బ్లాక్ క్యాట్స్‌గా పేరుపొందిన ఎన్ఎస్‌జీ బృందం తొలిసారి పరేడ్‌లో పాల్గొనడం కూడా ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ఈ వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.
 
దేశ రాజధాని ఢిల్లీలో 68వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌పథ్ వద్ద సైనికుల విన్యాసాలు మన భారత సైనిక పాటవానికి అద్దపడుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. ఇండియా గేట్ అమర్‌జవాన్ జ్యోతి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.