ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఆర్మీ ఆస్పత్రి హెల్త్ బులిటెన్... ఏంటంటే...

pranab mukherjee
ఠాగూర్| Last Updated: గురువారం, 20 ఆగస్టు 2020 (17:23 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బుధవారంతో పోల్చితే గురువారం ప్రణబ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని పేర్కొంది. ముఖ్యంగా, 84 యేళ్ళ ప్రణబ్ శరరీరంలోని కీలక అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయని, ఫలితంగా ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు.

అయినప్పటికీ ఆయన వెంటిలేటర్‌పైనే ఉందని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రణబ్‌ ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూచీలను స్పెషలిస్టుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు ఆర్మీ ఆస్పత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

కాగా, తొలుత కరోనా వైరస్ బారినపడిన ప్రణబ్‌ను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూరాగా, ఆయనకు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఓ క్లాట్ ఏర్పడినట్టు గుర్తించి, సర్జరీ చేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఆయనకు వెంటిలేటర్‌ అమర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఆయన కోమాలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. కానీ, గురువారం మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం కాస్త కుదుటపడినట్టు వైద్యులు వెల్లడించారు.

దీనిపై మరింత చదవండి :