శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (08:49 IST)

'కంచె' దాటుదామా? ఆర్మీ అధికారులతో పీఎం మోడీ 'వార్ రూమ్' మంతనాలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో యురిలో పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు దాడి చేసి 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకోవడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ దేశవ్యాప్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో యురిలో పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు దాడి చేసి 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకోవడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు, ఒత్తిడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'వార్ రూమ్' భేటీలకు శ్రీకారం చుట్టారు. 
 
ఈ అంశంపై ప్రధాని మోడీ బుధవారం రోజంతా వార్‌ రూమ్‌ (ఆర్మీ తాలూకూ మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టరేట్‌)లో అత్యున్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. వార్‌రూమ్‌గా వ్యవహరించే ఈ అత్యంత రహస్యమైన కార్యాలయం నుంచే రక్షణ శాఖ అన్ని భద్రతాపరమైన అంశాలనూ పర్యవేక్షిస్తుంది. మంగళవారం రాత్రి పొద్దుపోయేదాకా.. ఆ రూమ్‌లోనే ఉన్న పీఎం బుధవారం నాడూ భద్రత వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీతో అక్కడే రెండుసార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. 
 
యురి దాడి విషయంలో పాకిస్థాన్‌తో 'కంటికి కన్ను పంటికి పన్ను' తరహాలో వ్యవహరించాలని డిమాండ్లు వస్తుండటంతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, యురీ దాడికి ఎలా స్పందించాలో కేంద్ర కేబినెట్‌లోని కీలక మంత్రులతో, ఆర్మీ చీఫ్‌తో కార్యాచరణపై చర్చించారు. మ్యాప్‌లు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, సైకత నమూనాల ఆధారంగా మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఆయనకు పలు వివరాలు తెలియజేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.