బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (16:12 IST)

#RKNagarElectionResult : 15వ రౌండ్ పూర్తి... టీటీవీ ఆధిక్యం

చెన్నై, ఆర్కేనగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ తిరుగులేని మెజార్టీతో గెలుపు దిశగా పయనిస్తున్నారు.

చెన్నై, ఆర్కేనగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ తిరుగులేని మెజార్టీతో గెలుపు దిశగా పయనిస్తున్నారు. 15వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి దినకరన్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి 15వ రౌండ్ పూర్తయ్యేవరకు దినకరన్ 72515 ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు.

ఫలితంగా ఆయన గెలుపు తథ్యమని తేలిపోయింది. 15వ రౌండ్‌లో వివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను పరిశీలిస్తే... 

15వ రౌండ్ : దినకరన్ - 72515, మధుసూదనన్ - 36217, మరుదగణేష్ - 18924, నామ్ తమిళర్ కట్చి - 3316, బీజేపీ 1126. 

14వ రౌండ్ : దినకరన్ - 68302, మధుసూదనన్ - 36211, మరుదగణేష్ - 18928, నామ్ తమిళర్ కట్చి - 3083, బీజేపీ 942.  దినకన్ ఆధిక్యం - 32091.

11వ రౌండ్ : దినకరన్ - 54316, మధుసూదనన్ - 27737, మరుద గణేష్ - 14431, నామ్ తమిళర్ కట్చి - 2347, బీజేపీ 712, దినకరన్ ఆధిక్యం 26,579 ఓట్లు.

8వ రౌండ్ : దినకరన్ - 39548, మధుసూదనన్ - 19525, మరుదు గణేష్ -10292, నామ్ తమిళర్ కట్చి - 1732, బీజేపీ - 519. దినకరన్ ఓట్ల ఆధిక్యం 20023 ఓట్లు. 
 
7వ రౌండ్ : దినకరన్ - 34346, మధుసూదనన్ - 17471, మరుదగణేష్ - 9206, నామ్ తమిళర్ పార్టీ - 1509, నోటా - 925, బీజేపీ - 591.
 
6వ రౌండ్ : దినకరన్ - 29267, మధుసూదనన్ - 15184, మరుదగణేష్ - 7983, నామ్ తమిళర్ పార్టీ 1245, నోటా - 640, బీజేపీ - 408.
 
5వ రౌండ్ : దినకరన్ - 24132, మధుసూదనన్ 13057, మరుదు గణేష్ 6606, నామ్ తమిళర్ పార్టీ 962, బీజేపీ 318. 
 
4వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి దినకరన్‌ - 20,298, మధుసూదనన్ -9,672, మరుదుగణేష్‌కు - 5,091, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్‌కు 117, నామ్ తమిళర్ కట్చి - 737 చొప్పున ఓట్లు పోలయ్యాయి.
 
3వ రౌండ్ : దినకరన్‌ - 15868, మధుసూదనన్ - 7,033, మరుదుగణేష్‌కు - 3,750, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్‌కు 117, నామ్ తమిళర్ కట్చి - 737 చొప్పున ఓట్లు పోలయ్యాయి. కాగా, మొదటి, తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి ఓట్లు 66 ఓట్లు పోల్ కాగా, నోటాకు 102 ఓట్లు వచ్చాయి. 
 
అంతకుముందు టీటీవీ దినకర్ వర్గం కార్యకర్తలతో మొదలైన అన్నాడీఎంకే ఏజంట్లు, కార్యకర్తల మాటల యుద్ధం చినికి చినికి గాలివానగా మారగా, కౌంటింగ్ అధికారులపై వారు దాడికి దిగారు. దీంతో కౌంటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని రెండు వర్గాలనూ చెదరగొట్టి, మళ్లీ ఓట్ల లెక్కింపును కొనసాగించారు.