ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 మార్చి 2024 (19:45 IST)

sadguru vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ విజయవంతం

sadguru
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సద్గురు మెదడులో రక్తస్రావం అయ్యిందనీ, అది ప్రాణాంతకంగా మారే అవకాశం వున్నందున దానికి శస్త్రచికిత్స తప్పనిసరని వైద్యులు ఆపరేషన్ చేసారు.
 
శస్త్రచికిత్స మార్చి 17వ తేదీన చేసామనీ,  అది విజయవంతమైందని తెలిపారు. ఆసుపత్రి నుంచి సద్గురు వీడియో ద్వారా మాట్లాడారు.