బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మార్చి 2024 (11:36 IST)

ఏసీ భోగిలో ఎలుక.. ఎక్కడా చూసినా దుమ్మే.. ఎక్స్‌లో వీడియో

Rat
Rat
కదిలే రైలులో అదీ ఏసీ భోగిలో ఎలుక అటూ ఇటూ పరిగెత్తింది. దీనిని వీడియో తీసిన ప్రయాణీకులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జస్మిత అనే ప్రయాణీకురాలు ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో భోగీలోని సీట్ల కింద ఎలుక తిరగడం చూడొచ్చు. 
 
ఇంకో వీడియోలో రైలు అద్దాలు అపరిశుభ్రంగా వుండడం కనిపించింది. ఈ వీడియోలను రైల్వే మంత్రికి ఆమె ట్యాగ్ చేశారు. ఈ వ్యవహారం తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆమె కోరారు. 
 
"ఈ రైలు ప్రయాణంలో ఎలుకలు చుట్టుముట్టడం, అపరిశుభ్రతను చూసి షాకయ్యాను. ఈ సమస్యను పరిష్కరించడానికి అత్యవసరంగా ఏదైనా చేయాలి."అంటూ ఆమె చేసిన పోస్టు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. 
 
దీనిపై రైల్వే శాఖ స్పందించింది. "దయచేసి మీ పీఎన్నార్ నంబర్- మొబైల్ నెంబర్‌ను భాగస్వామ్యం చేయండి. మేము తక్షణ చర్య తీసుకోవడానికి వీలవుతుంది" అని డిపార్ట్‌మెంట్ రాసింది.