శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (10:38 IST)

'బాడీ మసాజ్' చేయించుకుని 'బాహుబలి 2' సినిమా చూసి ఎస్కేప్ అయిన సన్యాసి

ఓ మహిళా సన్యాసి పెరోల్‌పై బయటకు వచ్చింది. ఆ తర్వాత తనకు ఇష్టమైన మాల్‌కు వెళ్లింది. అక్కడ బాడీ మసాజ్ చేయించుకుంది. పిమ్మట బాహుబలి 2 చిత్రం చూసి.. రెస్ట్ రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి ఎస్కేప్ అయింది. ఈ స

ఓ మహిళా సన్యాసి పెరోల్‌పై బయటకు వచ్చింది. ఆ తర్వాత తనకు ఇష్టమైన మాల్‌కు వెళ్లింది. అక్కడ బాడీ మసాజ్ చేయించుకుంది. పిమ్మట బాహుబలి 2 చిత్రం చూసి.. రెస్ట్ రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి ఎస్కేప్ అయింది. ఈ సన్యాసి పేరు జైశ్రీగిరి. ఈమె ఓ ఆలయంతో పాటు.. ఓ స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతోంది. 
 
ఈ ఏడాది ప్రారంభంలో ఆమె ఆలయంపై గుజరాత్ పోలీసులు దాడులు నిర్వహించగా కోట్ల రూపాయల విలువైన బంగారు బిస్కెట్లతో పాటు మద్యం సీసాలు లభించాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె విచారణ ఖైదీగా ఉంది. తాజాగా ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమె పెరోల్‌పై బయటకు వచ్చింది. ఆమెకు రక్షణంగా నలుగురు గార్డులను కోర్టు నియమించింది. 
 
ఈ క్రమంలో, ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న తర్వాత తనకు కొంచెం విశ్రాంతి కావాలంటూ గార్డులను ఆమె బతిమాలుకుంది. ఆ తర్వాత తన వ్యక్తిగత లాయర్, పోలీస్ గార్డులతో కలసి అహ్మదాబాద్‌లోని హిమాలయన్ మాల్‌కు వెళ్లింది. అక్కడ తనకు నచ్చిన ఆహారాన్ని ఆరగించింది. ఆ తర్వాత బాడీ మసాజ్ చేయించుకుంది. అనంతరం 'బాహుబలి-2' సినిమా చూసింది.
 
ఆ తర్వాత తన పెరోల్‌ను పొడిగించే అవకాశం ఉందేమో అని ఆరా తీసింది. పెరోల్ కొనసాగింపు కుదరదని తేలడంతో... వాష్ రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి, జంప్ అయింది. దీంతో ఆమెను పట్టుకోవడానికి పోలీసులు వేట మొదలెట్టారు. మరోవైపు, ఆమె న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు.