బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Venu
Last Modified: గురువారం, 27 ఏప్రియల్ 2017 (17:09 IST)

రూ.2000 కోట్లకు చెక్ ఇవ్వు... బౌన్స్ అయ్యిందో... బతుకు బస్టాండే...

2014లో అరెస్ట్ అయ్యి గత సంవత్సరం కన్నతల్లి అంత్యక్రియలకు బెయిల్‌పై బయటికొచ్చి, అప్పటి నుండి దాన్ని పొడిగించుకుంటూ గడిపేస్తున్న సహారా చీఫ్‌కు సుప్రీంకోర్ట్ అల్టిమేటం జారీ చేసింది. ఇన్వెస్టర్ల వద్ద నుండి సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్ రూపంలో సెబీ నియమాలకు వ

2014లో అరెస్ట్ అయ్యి గత సంవత్సరం కన్నతల్లి అంత్యక్రియలకు బెయిల్‌పై బయటికొచ్చి, అప్పటి నుండి దాన్ని పొడిగించుకుంటూ గడిపేస్తున్న సహారా చీఫ్‌కు సుప్రీంకోర్ట్ అల్టిమేటం జారీ చేసింది. ఇన్వెస్టర్ల వద్ద నుండి సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్ రూపంలో సెబీ నియమాలకు విరుద్ధంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించే క్రమంలో 2 వేల కోట్ల రూపాయాలను చెక్కుల రూపంలో అందిస్తానన్న 68 ఏళ్ల సుబ్రతా రాయ్‌కు సుప్రీం జారీ చేసిన హెచ్చరిక ఇది.
 
దాదాపు 24 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉండగా, ఇప్పటికే సహారా సంస్థ 12 వేల కోట్ల రూపాయలను చెల్లించింది. చెప్పిన గడువు సమయానికి కాకుండా కాలయాపన చేయడంపై ఆగ్రహించిన సుప్రీం కోర్టు 5 వేల కోట్లను తక్షణమే చెల్లించాలని, అందులో 2 వేల కోట్లను జూన్‌ 15వ తేదీ లోపు చెల్లించాలని ఆదేశించింది. 
 
అలాగే మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలోని సహారాకు చెందిన ఆంబీ వ్యాలీ టౌన్‌షిప్ వేలాన్ని ఆపివేయాలన్న సుబ్రతా రాయ్ లాయర్ కపిల్ సిబాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. 10 వేల ఎకరాల్లో 18 గోల్ఫ్ కోర్టులు ఉన్న విలాసవంతమైన ఈ రిసార్టు మాత్రమే సుమారు 34 వేల కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఈ మొత్తం సెబీకి సహారా చెల్లించవలసిన దాని కంటే ఎక్కువ మొత్తం. కానీ సహారా ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు న్యూయార్క్ ప్లాజా హోటల్, లండన్ గ్రోస్వెనర్ హౌస్ హోటల్ సహా దేశ విదేశాల్లోని తన ఇతర ఆస్థులను విక్రయించే పనిలో ఉంది.