శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (17:53 IST)

శశికళను పంపిన స్వామి... టార్గెట్ స్టాలిన్, దయానిధి, కళానిధిలను కూడా...

సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడులోనే కాదు దేశంలోనే హడల్. కేసులు వేయడంలో ఆయనను మించినవారు లేరంటారు. అవినీతి, అక్రమాల మార్గాన పయనిస్తున్నారంటూ తనకు లేశమాత్రం తెలిసినా వెంటనే కోర్టులో పిటీషన్ వేస్తారనే ప్రచారం వుంది. అమ్మ జయలలితను, ప్రస్తుతం శశికళకు కార

సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడులోనే కాదు దేశంలోనే హడల్. కేసులు వేయడంలో ఆయనను మించినవారు లేరంటారు. అవినీతి, అక్రమాల మార్గాన పయనిస్తున్నారంటూ తనకు లేశమాత్రం తెలిసినా వెంటనే కోర్టులో పిటీషన్ వేస్తారనే ప్రచారం వుంది. అమ్మ జయలలితను, ప్రస్తుతం శశికళకు కారాగార వాసం వెనుక స్వామి పిటీషన్లే కారణమని వేరే చెప్పక్కర్లేదు. తను అనుకున్నట్లే శశికళకు జైలు శిక్ష పడింది. ఇప్పుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నాడీఎంకే పార్టీని వదిలేశారు. తాజాగా ఆయన టార్గెట్ డీఎంకే పార్టీ నాయకుపైన పడింది. 
 
శశికళ కంటే డీఎంకే పార్టీకి చెందిన స్టాలిన్, దయానిధి మారన్, కళానిధి మారన్ లు చాలా ప్రమాదకరమైన వ్యక్తులంటూ విరుచుకుపడ్డారు. అవినీతిని పారదోలడం అనే కార్యక్రమంలో ఇంకా చేయాల్సింది చాలానే వుందంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. డీఎంకే నిరుద్యోగ యువతను రిక్రూట్ చేసుకుని వారితో తమకు అనుకూలమైన, ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకంగా ట్విట్టర్ పోస్టులు ఇప్పించుకుంటూ చీప్ ట్రిక్స్ చేస్తోందంటూ విమర్శించారు.