రూ.10 కోట్ల అపరాధం చెల్లించకుంటే మరో 13 నెలలు జైల్లోనే...
ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు నాలుగేళ్ళ జైలుతో పాటు.. రూ.10 కోట్ల అపరాధాన్ని సుప్రీం కోర్టు విధించింది. దీంతో శశికళ బెంగుళూరులోని పరప్పణ
ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు నాలుగేళ్ళ జైలుతో పాటు.. రూ.10 కోట్ల అపరాధాన్ని సుప్రీం కోర్టు విధించింది. దీంతో శశికళ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జరిమానాను శశికళ చెల్లించకపోతే ఏమవుతుందనే ప్రశ్న చాలా మందిలో నెలకొంది. ఒకవేళ రూ.10 కోట్ల జరిమానాను శశికళ కట్టలేకపోతే మరో 13 నెలల అదనపు జైలు శిక్షను ఆమె అనుభవించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని జైలు అధికారులు తెలిపారు.
2014లో ట్రయల్ కోర్టు ఆమెకు జైలు శిక్షను విధించడంతో అప్పట్లో ఆమె 21 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఆమె మూడు సంవత్సరాల 11 నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది. ఈ శిక్షా కాలంతో పాటు.. అపరాధం చెల్లించకుంటే అదనంగా మరో 13 నెలల జైలు శిక్షను అదనంగా అనుభవించాల్సి ఉంటుందని జైలు అధికారులు వివరించారు.