గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (05:43 IST)

శశికళ అదృష్ట సంఖ్యతో సీఎం పన్నీర్‌సెల్వంకు దురదృష్టం... ఎందుకంటే...

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగా, సీఎం పగ్గాలు స్వీకరించేందుకు ముహూర్తం

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగా, సీఎం పగ్గాలు స్వీకరించేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టు పోయస్ గార్డెన్ వర్గాల సమాచారం. 
 
అన్నాడీఎంకే విశ్వసనీయవర్గాలు. శశికళకు జ్యోతిష్యులు తాజాగా ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం ఆమె ఈనెల 19 లేదా 27 తేదీల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ఆ వర్గాలు చెబుతున్నాయి. జయ మరణం తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించిన శశికళ.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఆమె తప్ప మరెవ్వరూ అర్హులు కాదని పార్టీ నేతలతో చెప్పించడమే గాక తననే ఏకగ్రీవంగా ఎన్నుకునేలా పావులు కదిపారు. అనంతరం పార్టీపై గట్టి పట్టూ సాధించారు.
 
అచ్చంగా జయలలిత తరహాలోనే కట్టుబొట్టుతో ఆమెను మరిపించేలా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీలో మొదట్లో ఆమె పట్ల వ్యక్తమైన వ్యతిరేకత కొంత తగ్గింది. మరోవైపు పన్నీర్‌ సెల్వం సీఎం పదవిని చేపట్టిన మూడు రోజులకే.. (డిసెంబరు 8న) ముగ్గురు సీనియర్‌ మంత్రులు శశికళ పార్టీ పగ్గాలతో పాటు, సీఎం పదవిని కూడా చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కొద్దిరోజులకు ఆ ముగ్గురికి మరో ఇద్దరు సీనియర్‌ మంత్రులు వంతపాడారు. 
 
ఈ నేపథ్యంలో సీఎంగా శశికళ త్వరలో బాధ్యతలు చేపడతారని అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం పన్నీర్‌సెల్వం గురువారం చేయాల్సిన పలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలు హఠాత్తుగా రద్దు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
దీనికి కారణం ముఖ్యమంత్రి పగ్గాలను శశికళ స్వీకరించాలన్న గట్టిపట్టుదలతో ఉండటమే. ఇందులభాగంగా, జ్యోతిష్యులు సూచినట్టుగా, తన అదృష్ట సంఖ్యలైన 19 లేదా 27వ తేదీల్లో శశికళ సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. ఈ సంఖ్యలు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం పాలిట దురదృష్టంగా మారనున్నాయి.