శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జులై 2018 (08:51 IST)

బెడ్రూంలో నా భర్త తుస్‌మంటున్నాడు... అసహజ శృంగారం చేయమంటున్నాడు...

శృంగారపు సామర్థ్యం లేని తన భర్త అసహజ శృంగారం చేయమంటూ నిరంతరం ఒత్తిడి చేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ ఓ భార్య దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఘటన ఇపుడు సంచలనం రేపుతోంది. ఈ వివరాలను పరిశ

శృంగారపు సామర్థ్యం లేని తన భర్త అసహజ శృంగారం చేయమంటూ నిరంతరం ఒత్తిడి చేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ ఓ భార్య దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఘటన ఇపుడు సంచలనం రేపుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గుజరాత్ రాష్ట్రంలోని సబర్‌కాంత పట్టణానికి చెందిన యువతికి ఓ డాక్టరుతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన నాటి నుంచి తన భర్త  అసహజంగా శృంగారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఇచ్చిన ఫిర్యాదుపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతలో భర్త తన భార్య ఫిర్యాదును కొట్టివేయాలని గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. 
 
ఇరు తరపు వాదనలు ఆలకించిన కోర్టు.. ఆమె ఫిర్యాదును తిరస్కరించింది. దీంతో తన భర్త సెక్స్ సామర్ధ్యం లేనందువల్ల తనపై అసహజ శృంగారం చేస్తున్నాడని భార్య ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసహజ శృంగారానికి అంగీకరించకుంటే భర్త తనను తిట్టడమే కాకుండా బెదిరిస్తూ కొడుతున్నాడని భార్య ఆవేదనగా సుప్రీంకోర్టుకు విన్నవించింది. 
 
మహిళ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దర్యాప్తు బాధ్యతను జస్టిస్ ఎన్.వి.రమణ, ఎం.ఎం.శంతన్ గౌదార్‌ల ధర్మాసనానికి అప్పగించింది. దీంతో సుప్రీంకోర్టు నిందితుడైన భర్తకు నోటీసులు జారీ చేసింది. ప్రకృతికి విరుద్ధంగా అసహజ శృంగారం చేయడం ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరం.