శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 2 జనవరి 2021 (15:16 IST)

నా చావుకి నేనే కారణం: మహిళా ఎస్సై ఆత్మహత్య

తన చావుకి తనే కారణమంటూ ఓ మహిళా ఎస్సై తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ బులంద్షహర్ జిల్లాలోని అనూప్షహర్ పోలీసు స్టేషనులో 30 ఏళ్ల అర్జూ ఎస్సైగా విధులు నిర్వహిస్తోంది. ఐతే ఏమయ్యిందో ఏమోగానీ శుక్రవారం నాడు ఆమె తను అద్దెకు వుంటున్న ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది.
 
ఇంట్లో నుంచి అర్జూ ఎంతకీ రాకపోవడంతో ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా ఆమె ఫ్యానుకి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. దీనితో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆమె చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. కాగా తన చావుకి తనే కారణమని సూసైడ్ నోట్ రాసింది అర్జూ. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.