మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 మార్చి 2018 (16:29 IST)

ఓ నర్తకి నా మనసు పాడు చేసింది : ఆజాం ఖాన్ (వీడియో)

సినీ నటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) సీనియర్ నేత ఆజాంఖాన్‌ చురకలు అంటించారు. తనను 'పద్మావత్' చిత్రంలోని ఖిల్జీ పాత్రతో జయప్రద పోల్చడంపై ఆయన మండిపడ్డారు.

సినీ నటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) సీనియర్ నేత ఆజాంఖాన్‌ చురకలు అంటించారు. తనను 'పద్మావత్' చిత్రంలోని ఖిల్జీ పాత్రతో జయప్రద పోల్చడంపై ఆయన మండిపడ్డారు. 
 
తాజాగా జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 'ఇటీవల ఓ మహిళ, ఓ నర్తకి ఈ సేవకుడి గురించి ఏవో వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నర్తకిలు, గాయనులతో గొడవపడుతుంటే నేనెప్పుడు రాజకీయాలు చేయాలి.. మీరే చెప్పండి?' అంటూ ఆయన తన మద్దతుదారులను ప్రశ్నించారు. 
 
'పద్మావత్ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులో ఖిల్జీ పాత్ర చాలా దుర్మార్గంగా ఉందని విన్నాను. ఖిల్జీ రాక ముందే పద్మావత్ స్వర్గసీమకు పలాయనం చిత్తగించిందని విన్నాను'  అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‍గా మారింది.