సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (21:31 IST)

నటి షబానా అజ్మీకి తీవ్ర గాయాలు

బాలీవుడ్ సీనియర్​ ​నటి షబానా అజ్మీ కారు ప్రమాదానికి గురైంది. కారును లారీ ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ముంబయి- పుణే ఎక్స్​ప్రెస్​వేపై ఖలాపుర్​ సమీపంలో ఈ  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షబానాకు తీవ్ర గాయాలయ్యాయి. నవీ ముంబయిలోని ఎమ్​జీఎమ్ ఆసుపత్రికి ఆమెను తరలించారు.

​ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆమె భర్త జావేద్​ అక్తర్​ కూడా ఉన్నారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.