సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (11:32 IST)

తెరపైకి రామమందిరం... ఇచ్చుపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లండి.. సుప్రీంకోర్టు రూలింగ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరిందో లేదో... ఇటు రామమందిర అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక రూలింగ్ ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరిందో లేదో... ఇటు రామమందిర అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక రూలింగ్ ఇచ్చింది. 
 
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే అంశంపై ఇరు పక్షాలూ కూర్చుని చర్చించుకోవాలని, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చింది. ముస్లిం, హిందూ మతపెద్దలు ఏ నిర్ణయంతో వచ్చినా, మరో విచారణ లేకుండా కేసును మూసివేసి, వారి నిర్ణయాన్నే అమలు చేస్తామని ప్రకటించింది. 
 
ఈ విషయంలో అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని మాత్రమే తెలిపింది. అదేసమయంలో ఈ కేసును ఇంకా కొనసాగించడం ఇష్టం లేదని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ, ఇకపై ఈ కేసును ఇకపై దీర్ఘకాలం పాటు వాయిదాలు వేయలేమని పేర్కొంది.
 
ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 325 సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు చేపట్టారు.