సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 జులై 2017 (09:04 IST)

ఫరీద్‌కోట్‌లో సెక్స్‌ రాకెట్ గుట్టురెట్టు.. ఏడుగురు యువతుల అరెస్టు

దక్షిణ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో సెక్స్ రాకెట్‌ను గుట్టురట్టు అయింది. ఫరీద్‌కోట్‌లోని మూడు హోటల్స్‌లో‌ వ్యభిచారం చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అర్థరాత్రి మూడు హోటళ్ల

దక్షిణ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో సెక్స్ రాకెట్‌ను గుట్టురట్టు అయింది. ఫరీద్‌కోట్‌లోని మూడు హోటల్స్‌లో‌ వ్యభిచారం చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అర్థరాత్రి మూడు హోటళ్లపై ఆకస్మికంగా దాడులు చేశారు. 
 
హోటల్ గదుల్లో విటులతో రాసక్రీడలు సాగిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. మూడు హోటళ్లలో ఏడుగురు మహిళలతో సహా 21 మందిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. పోలీసుల దాడులతో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది.