శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 మార్చి 2017 (11:59 IST)

సిద్ధూకు షాక్... పనికిరాని శాఖ... ఆ పదవీ పీకే పనిలో కాంగ్రెస్...?

నవజ్యోత్ సింగ్ సిద్ధూ భాజపాకు అడ్డంగా తిరిగేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం, పంజాబ్ రాష్ట్రంలో విజయఢంకా మోగిస్తూ గెలవడం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత ఆయనను పంజాబ్ ఉపముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతారనుకుంటే అదేమీ కాకుండా పనికిరాని శాఖ అని కొందరు మంత్రులు చెప్

నవజ్యోత్ సింగ్ సిద్ధూ భాజపాకు అడ్డంగా తిరిగేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం, పంజాబ్ రాష్ట్రంలో విజయఢంకా మోగిస్తూ గెలవడం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత ఆయనను పంజాబ్ ఉపముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతారనుకుంటే అదేమీ కాకుండా పనికిరాని శాఖ అని కొందరు మంత్రులు చెప్పుకునే పర్యాటకం, సాంస్కృతి శాఖను అప్పచెప్పారు. అదలావుండగానే ఇప్పుడు ఆ మంత్రి పదవికి కూడా ఎసరు వచ్చేట్లు కనిపిస్తోంది. 
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే... నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రముఖ రియాలిటీ షో ‘కపిల్ శర్మ కామెడీ నైట్స్’కు జడ్జిగా వున్నారు. తను మంత్రి అయినప్పటికీ దాన్ని మాత్రం వదలనని చెప్పారు సిద్ధూ. ఇప్పుడదే పితలాటకంగా మారిందంటున్నారు. ఒక మంత్రిగా బాధ్యతలు వహించే వ్యక్తి ఇలా టీవీ రియాల్టీ షోలు చేయవచ్చో లేదో ముఖ్యమంత్రి అమరిందర్ సింగుకు తెలియదట. 
 
అందుకే న్యాయ సలహా కోరినట్లు చెప్పారు. ఒకవేళ న్యాయ సలహా ప్రకారం ఆయన టీవీ షోలు చేస్తూ పదవిలో ఉండకూడదని చెబితే... సిద్ధూ ఏదో ఒకటి వదలుకోవాల్సి వుంటుంది. రియాలిటీ షోతో సిద్ధూ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. మరి అలాంటిది వదులుకుని మంత్రిగా మాత్రమే విధులను నిర్వహిస్తూ వుంటారా.. వేచి చూడాలి.