సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (17:39 IST)

పూరింట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురు చిన్నారులు సజీవ దహనం

ఓ పూరింట్లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని ఆరుగురు చిన్నారులు సజీవ దహనమైన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అరారియా జిల్లా కబైయా గ్రామంలో ఓ పూరింట్లో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మొక్కజొన్నలు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ చిన్నారులు బయటకు రాలేకపోయారు. చిన్నారుల హాహాకారాలు విని స్థానికులు అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చిన్నారుల్ని కాపాడలేకపోయారు. 
 
ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా 3 నుంచి ఆరేళ్లు లోపు చిన్నారులే కావడం అందరినీ కలిచివేస్తోంది.