శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (14:22 IST)

50 మంది పాక్ సైనికుల తలలు తెగాలి.. ప్రేమ్ సాగర్ కుమార్తె డిమాండ్

తన తండ్రి తల తెగనరికి పాకిస్థాన్ సైనికులకు తగిన గుణపాఠం చెప్పాలని, ఇందుకోసం 50 మంది పాక్ సైనికుల తలలు తెగనరకాలని అమరజవాను ప్రేమ్ సాగర్ కుమార్తె డిమాండ్ చేస్తోంది. అలాగే, దేశం కోసం తన తండ్రి ప్రాణ త్యా

తన తండ్రి తల తెగనరికి పాకిస్థాన్ సైనికులకు తగిన గుణపాఠం చెప్పాలని, ఇందుకోసం 50 మంది పాక్ సైనికుల తలలు తెగనరకాలని అమరజవాను ప్రేమ్ సాగర్ కుమార్తె డిమాండ్ చేస్తోంది. అలాగే, దేశం కోసం తన తండ్రి ప్రాణ త్యాగం చేశారు.. ఆయన త్యాగం వూరికే పోదన్నారు. 
 
సోమవారం నియంత్రణ రేఖ వద్ద బీఎస్‌ఎఫ్‌ జవాన్ ప్రేమ్‌సాగర్‌తోపాటు మరో జవాన్ని పాక్‌ సైన్యం అతి కిరాతకంగా హతమార్చింది. ఈ జవాను అంత్యక్రియలు మంగళవారం ప్రేమసాగర్ స్వస్థలం యూపీలోని డియోరియాలో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన తన సోదరుడిని చూస్తే ఎంతో గర్వంగా వుందని, కానీ పాక్‌ సైన్యం అత్యంత కిరాతకంగా వ్యవహరించిందని ప్రేమ్‌సాగర్‌ బ్రదర్ ఆవేదన వ్యక్తంచేశాడు. 
 
జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్‌కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీమ్ - బీఏటీ.. సరిహద్దు భద్రతా దళంపై దాడి చేసి ఇద్దరు భారత జవాన్లను పొట్టన బెట్టుకోవడమే కాకుండా అత్యంత క్రూరంగా వాళ్ల మృతదేహాలను ఛిద్రం చేశారు, ఆపై తలలను మొండెం నుంచి వేరు చేసింది. ఇందుకు ప్రతీకారంగా భారత్‌.. పాక్‌ బంకర్లపై దాడి చేసి ఏడుగురు సైనికులను హతమార్చిన విషయం తెల్సిందే.