శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2017 (11:42 IST)

సోనియాకి అస్వ‌స్థ‌త.. అమ్మకు ఫర్వాలేదన్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్ర‌చారం కొన‌సాగిస్తోంది. ఈ నేప

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్ర‌చారం కొన‌సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో సిమ్లాలోనే ఉన్న సోనియా గాంధీ శుక్రవార అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆమెను వెంట‌నే ఢిల్లీలోని గంగారామ్‌ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 
 
ఈ విష‌యంపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌నకు గుర‌వుతోన్న నేప‌థ్యంలో ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. అమ్మ‌కు ఫ‌ర్వాలేద‌ని చెప్పారు. స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో సోనియా గాంధీని ఢిల్లీకి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీలేద‌ని చెప్పారు. త‌మ పట్ల చూపిస్తోన్న ప్రేమ‌, అభిమానాల‌కు ధన్య‌వాదాలు చెబుతున్నాన‌ని పేర్కొన్నారు.