శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (15:01 IST)

అమ్మపై ప్రేమను చంపుకోలేక.. మృతదేహాన్ని నవమాసాలు దాచిన తనయులు!

నవమాసాలు మోసి, కని, పెంచి పిల్లల బాగుకోరుకోవడం, తమ బిడ్డలు క్షేమంగా ఉండాలని ప్రతి తల్లీదండ్రి భావిస్తుంటారు. అలాంటి తల్లిదండ్రులు చనిపోతే వారికి అంత్యక్రియలు చేస్తుంటారు.

నవమాసాలు మోసి, కని, పెంచి పిల్లల బాగుకోరుకోవడం, తమ బిడ్డలు క్షేమంగా ఉండాలని ప్రతి తల్లీదండ్రి భావిస్తుంటారు. అలాంటి తల్లిదండ్రులు చనిపోతే వారికి అంత్యక్రియలు చేస్తుంటారు. కానీ, ఆ ఇద్దరు తనయులు మాత్రం మరోలా చేశారు. నవమాసాలు మోసిన తల్లి రుణాన్ని ఆమె మృతదేహాన్ని నవమాసాలు దాచి ఉంచి రుణం తీర్చుకున్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కోల్‌కతాకు చెందిన అరుణ్ సాహా(65), అజిత్ సాహా(55) అన్నదమ్ములు. బ్రహ్మచారులు. వారి అమ్మ నాని బాలా సాహా(85) జనవరి 16వ తేదీన చనిపోయింది. అయితే ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు... దాదాపు 9 నెలలు తల్లి శవాన్ని ఇంట్లో మంచం మీద ఉంచారు. కొద్దిరోజుల క్రితం ఇంటి పక్కన ఉన్న వారు తల్లి ఆరోగ్యం గురించి ఆరా తీయగా ఆమె జబ్బుతో బాధపడుతోందని, విశ్రాంతి తీసుకుంటుందని చెప్పేవారు.
 
ఈ పరిస్థితుల్లో ఓ సర్వే చేయడానికి ఇంటికి వచ్చిన అధికారి... ఇంట్లో ఉన్న అందరి లెక్కలు తీసుకుంటూ, వివరాలు అడిగాడు. వారి అమ్మగారిని చూపించమని అడిగితే అతనిని పంపించి, తలుపులు మూసేశారు. దీంతో అనుమానమొచ్చిన అతను, మరో ఆరుగురితో కలిసి ఇంట్లోకెళ్లి చూడగా ఓ చీకటి గదిలో మంచంపై 85 సంవత్సరాల బాలాసాహా మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని చూసిన స్థానికులు అవాక్కయ్యారు. 
 
వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఆ ఇద్దరు అన్నదమ్ములను విచారించారు. వారిలో పెద్ద కొడుకు మాట్లాడుతూ చనిపోయిన కొద్దిరోజులకు అంత్యక్రియలు చేద్దామనుకున్నామని, కానీ అప్పటికే శరీరం చేత్తో పట్టుకోవడానికి వీల్లేకుండా పాడైపోయిందని తెలిపాడు. ఈ అన్నదమ్ములిద్దరి మానసిక స్థితి సరిగాలేదని పోలీసులు తెలిపారు.