మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:09 IST)

ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు.. దివికేగిన అతిలోకసుందరి

అతిలోకసుందరి అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి ముంబైకి శ్రీదేవి పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. ఆపై లోఖండ్ వాలాలోని ఆమె నివాసంలో వుంచారు. ఆ తర్వాత అభిమా

అతిలోకసుందరి అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి ముంబైకి శ్రీదేవి పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. ఆపై లోఖండ్ వాలాలోని ఆమె నివాసంలో వుంచారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్ధం సెలబ్రేషన్స్‌ క్లబ్‌కు తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం అంతిమ యాత్ర బయల్దేరింది. ఆమె పార్థివ దేహాన్ని ఆమెకు ఇష్టమైన ఎరుపు రంగు కాంజీవరం చీర, ఎర్రని బొట్టు, తెల్లని పూలతో దేవకన్యలా అలంకరించారు. 
 
దాదాపు ఏడు కి.మీల మేర సాగిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. కడసారి చూపు కోసం అభిమానులు విల్లేపార్లే శ్మశాన వాటికకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, అభిమానుల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దీంతో ఇక సెలవంటూ.. శ్రీదేవి.. అతిలోకసుందరి మరలిరాని లోకాలకు తరలిపోయారు.