గో హత్యలకు పాల్పడేవారికి మరణశిక్షే సరి.. ఆయన ఆ పనే చేశాడు: సుబ్రహ్మణ్య స్వామి
భారత్‌ను పరిపాలించిన బహద్దూర్ షా జాఫక్ తన పాలనలో గోహత్యలకు పాల్పడేవారికి మరణ శిక్షను విధించేవారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గుర్తు చేశారు. అందుకే మాంసం విక్రయాలతో సొమ్ము చేసుకోవాలని భావిస్తూ గో హత
భారత్‌ను పరిపాలించిన బహద్దూర్ షా జాఫక్ తన పాలనలో గోహత్యలకు పాల్పడేవారికి మరణ శిక్షను విధించేవారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గుర్తు చేశారు. అందుకే మాంసం విక్రయాలతో సొమ్ము చేసుకోవాలని భావిస్తూ గో హత్యలకు పాల్పడేవారికి మరణదండనే సరైనశిక్ష అని స్వామి చెప్పారు.
మంగళూరులో రామచంద్రాపుర మఠం నిర్వహిస్తున్న మంగళ గోయాత్ర ముగింపు వేడుకల్లో భాగంగా ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మంగళ గోయాత్ర ముగింపు వేడుకల్లో మఠాధిపతి రాఘవేశ్వర భారతి, కర్ణాటక బ్యాంకు పాలక మండలి డైరక్టర్ పి.జయరామ భట్, లండన్ నుంచి వచ్చిన డా.అలెక్స్ హ్యాంకి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. గోహత్య నిషేధానికి సమగ్రతతో కూడిన చట్టాన్ని చేసేందుకు పార్లమెంటులో చర్చను లేవదీస్తానని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భాజపా కట్టుబడి ఉందన్నారు. త్వరలో నిర్మాణ పనుల్ని పార్టీ ప్రారంభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.