సుప్రీంను తప్పుపట్టిన భారత సైన్యం.. ఎన్డీఏ పరీక్షలు రాయనివ్వరా?
భారత సైన్యం తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఎన్డీఏ పరీక్షలను మహిళలు రాసేందుకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆర్మీ తీరును సుప్రీం ఖండించింది. సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఎన్డీఏ పరీక్షలో మహిళలకు అవకాశం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం తన తాజా ఆదేశాల్లో పేర్కొంది.
తమ విధివిధానం ప్రకారం మహిళలకు స్థానం కల్పించడం లేదని కోర్టుకు ఆర్మీ తెలిపింది. ఆర్మీ ఇచ్చిన వివరణ పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విధానం లింగవివక్షతో కూడుకుని ఉన్నట్లు కోర్టు ఆరోపించింది. తుది ఆదేశాలకు లోబడి అడ్మిషన్లు ఉంటాయని కోర్టు తన తీర్పులో తెలిపింది.