సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (11:13 IST)

శశికళకు కన్నీరు- పన్నీర్‌కే పన్నీరు చల్లిన సుప్రీం కోర్టు.. సెల్వం ఇంటివద్ద పండేగ పండగ

దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీం కోర్టు దోషిగా ప్రకటించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కొట్టిపారేసిన సుప్రీంకోర్టు... శశికళను దోషిగా నిర్ధారించింది. ఆమెతో పాటు దివంగత జయలలిత, ఇళవర

దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీం కోర్టు దోషిగా ప్రకటించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కొట్టిపారేసిన సుప్రీంకోర్టు... శశికళను దోషిగా నిర్ధారించింది. ఆమెతో పాటు దివంగత జయలలిత, ఇళవరసి, సుధాకరణ్‌లను దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. వీరందరికీ నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. అంతేకాదు పదేళ్ల పాటు శశికళ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. 
 
ఇంకా పదికోట్ల రూపాయల జరిమానా విధించింది. శశికళ జైలుకు వెళ్లనున్న నేపథ్యంలో తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సుప్రీం తీర్పుతో పన్నీర్ సెల్వం శిబిరంపై పన్నీరు కురవగా... శశికళ శిబిరంలో కన్నీరే మిగిలింది. 
 
కాగా ఇన్నాళ్లుగా సీఎం పదవిపై చిన్నమ్మ పెట్టుకున్న శశికళ ఆశలు అడియాశలయ్యాయి. ఆమెకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లో నైరాశ్యం నెలకొంది. పన్నీరుకు జై కొట్టేందుకు ఆమె వర్గంలోని ఎమ్మెల్యేలంతా సిద్ధమయ్యారు. ఇక గోల్డెన్ రెసార్ట్‌లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు.