ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (11:58 IST)

శశికళ ఆశలు గల్లంతు... చిన్నమ్మతో కలిసి జైలుకెళ్లనున్న ఇళవరసి - సుధాకరన్

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై వీకె.శశికళ పెట్టుకున్న కోటి ఆశలు గల్లంతయ్యాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం విడుదల వెల్లడించింది. ఈ కేసును విచారించిన జడ్జి పినాకి చంద్రఘో

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై వీకె.శశికళ పెట్టుకున్న కోటి ఆశలు గల్లంతయ్యాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం విడుదల వెల్లడించింది. ఈ కేసును విచారించిన జడ్జి పినాకి చంద్రఘోష్ ఆమెను దోషిగా తేల్చుతూ తీర్పిచ్చారు. ఇదే కేసులో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా తోసిపుచ్చుతూ.. బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 
 
దీంతో శశికళతో పాటు మిగిలిన ఇద్దరిని కూడా దోషులుగా మారారు. ఈ కేసులో జయలలితతో పాటు.. శశికళ, ఇళవరసి, సుధాకరన్‌కు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. జయలలిత మరణించడంతో కోర్టు తీర్పుతో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 
 
ఇళవరసి శశికళకు స్వయాన వదిన. ఈ నలుగురికి జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల జరిమానాను సుప్రీం కోర్టు శశికళకు విధించింది. నాలుగు వారాల్లో జైలులో లొంగిపోవాలని శశికళను సుప్రీంకోర్టు ఆదేశించింది. శశికళతో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్న అనేక కంపెనీలు ఈ తీర్పుతో సందిగ్దంలో పడ్డాయి.