శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (08:06 IST)

విద్యార్థి లేఖకు స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్.. ఎందుకోసం?

ఓ విద్యార్థి రాసిన లేఖకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. భవిష్యత్‌లో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ విశ్వవిద్యాలయ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వివ

ఓ విద్యార్థి రాసిన లేఖకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. భవిష్యత్‌లో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ విశ్వవిద్యాలయ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఢిల్లీలోని ఆమిటీ వర్సిటీ లా స్కూల్‌లో చదువుతున్న సుశాంత్ రోహిల్లా గతనెల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తగినంత హాజరుశాతం లేదనే కారణంతో మూడో సంవత్సరం పరీక్షలు రాయనిచ్చేందుకు వర్సిటీ అధికారులు సుశాంత్‌ను అనుమతించలేదు. దీంతో తాను వైఫల్యం చెందిన భావన కలిగిందని సుశాంత్‌ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు.
 
సుశాంత్‌ ఆత్మహత్యకు కారణమైన ఆమిటీ వర్సిటీపై విచారణ జరపాలని కోరుతూ అతని స్నేహితుడు, సహచర విద్యార్థి అయిన రాఘవ శర్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌కు లేఖ రాశారు. అతని లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. క్యాంపస్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ యూనివర్సిటీ అయిన ఆమిటీకి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.