ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (08:56 IST)

ప్లీజ్ సుష్మాజీ.. పాకిస్థాన్ యువతితో నా పెళ్లి జరిపించండి : జోధ్‌పూర్‌ యువకుడు

ఆపదల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లవేళలా ముందుండే భారత విదేశీ వ్యవహారాల శాఖామంత్రి సుష్మా స్వరాజ్‌కు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు ఓ విజ్ఞప్తి చేశాడు. తనకు, పాకిస్థాన్ యువతికి

ఆపదల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లవేళలా ముందుండే భారత విదేశీ వ్యవహారాల శాఖామంత్రి సుష్మా స్వరాజ్‌కు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు ఓ విజ్ఞప్తి చేశాడు. తనకు, పాకిస్థాన్ యువతికి పెళ్లి జరిపించాలని ప్రాధేయపడ్డాడు. 
 
ప్రస్తుతం ఇండోపాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్న విషయం తెల్సిందే. దీంతో పాకిస్థాన్‌ నుంచి భారతకు వచ్చే వారికి భారత రాయబార కార్యాలయం వీసాలు మంజూరు చేయడం లేదు. ఈ నిర్ణయంతో జోధ్‌పూర్‌కు చెందిన యువకుడి వివాహం సందిగ్ధంలో పడింది. 
 
జోధ్‌పూర్‌లో నివసించే నరేశ్‌ తేవానీకి, కరాచీకి చెందిన ప్రియా బచ్‌చనీతో నవంబరులో పెళ్లి. అయితే యురీ ఉగ్రదాడి, భారత సర్జికల్‌ స్ట్రైక్స్‌తో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత్‌కు వచ్చే పాక్‌ దేశస్థులకు భారత ఎంబసీ వీసాలను నిలిపివేసింది. 
 
అయితే ప్రియా కుటుంబీకులు 3 నెలల క్రితమే వీసాకు దరఖాస్తు చేశారని, దీనిని పరిగణనలోకి తీసుకుని ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు వీసా మంజూరు చేయాలని సుష్మా స్వరాజ్‌ను నరేశ్‌ ప్రాధేయపడ్డారు. దీనిపై సుష్మా స్వరాజ్ స్పందించాల్సి ఉంది.