బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (13:33 IST)

నటుడు మాజీ ఎంపీ జేకే రితీష్ ఇక లేరు.. ఈయన స్టైల్ గురించి..?

2009వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో తమిళనాడు, రామనాథపురం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్లాడు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రితీష్ స్టైల్ గురించి మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వద్ద అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అడిగి తెలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
 
రామనాథపురం డీఎంకే పార్లమెంట్ సభ్యుడు జేకే రితీష్, 2014వ ఏడాది అన్నాడీఎంకేలో చేరాడు. చెన్నై పోయెస్ గార్డెన్‌లో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలితతో భేటీ అనంతరం ఆ పార్టీలో చేరారు.
 
ఇక చిన్నపుల్ల అనే సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన రితీష్.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల రితీష్ నటించిన ఎల్కేజీ సినిమా హిట్ అయ్యింది. అయితే గుండెపోటు కారణంగా రితీష్ మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. మరణించేనాటికి ఆయనకు 46 సంవత్సరాలు.