మురళీధరన్ నమ్మకద్రోహి: తమిళ దర్శకుడు భారతీరాజా తీవ్ర విమర్శ

వి| Last Modified శుక్రవారం, 16 అక్టోబరు 2020 (18:39 IST)
ప్రపంచ క్రికెట్ చరిత్రలో స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ఒక సువర్ణాధ్యాయం. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఘనతలను సొంతం చేసుకొని పలు రికార్డులు సృష్టించాడు. టెస్టుల్లో 800, వన్డేల్లో 534 వికెట్లు పడగొట్టి దిగ్గజ బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు. తమిళ సంతతి శ్రీలంక జాతీయుడైన మురళీధరన్ జీవిత చరిత్రపై ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కుతోంది.

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు 800 అనే టైటిల్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేశారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా వివేక్ రంగాచారి నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాపై పలువురు తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాతివివక్షను పాటిస్తున్న దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ జీవితాన్ని ఎలా తెరకెక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా ఈ చిత్రంపై మండి పడ్డారు. అంతేకాకుండా మురళీధరన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక మతవాదానికి మురళీధరన్ కూడా మద్దతు పలికాడని విమర్శించారు. చివరకు భారతదేశానికి నమ్మక ద్రోహిగా మిగిలిపోయాడని అలాంటి వ్యక్తి బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటించడం సరికాదని అన్నారు.దీనిపై మరింత చదవండి :