శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (15:11 IST)

సీరియల్ రేపిస్ట్.. ఆటో డ్రైవరే కానీ కీచకుడు.. ఏడుగురు మహిళలను అలా?

ఆటో డ్రైవర్ కీచకుడి మారిన ఘటన తమిళనాడు సేలంలో చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్‌గా వుంటూ ఏడుగురు మహిళలను కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్నంతా వీడియో తీసి బాధితులను బెదిరించేవాడు. ఈ ఘటన సేలంలో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై నుంచి మహిళలను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ శంకర్ వారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో ఆతని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ ఆటో డ్రైవర్ శంకర్ ఆపై తన స్నేహితుడి ఇంట్లో వుంటూ అతడి భార్యను లొంగదీసుకుని వివాహం చేసుకున్నాడు. కానీ అతడి రెండో భార్య కూడా అతనితో సంసారం చేయలేదు. 
 
ఈ నేపథ్యంలో సేలం జిల్లాకు చెందిన ఓ మహిళ శంకర్ ఆటోలో ప్రయాణం చేసినట్లు పోలీసులకు తెలిసింది. ఆ ఆటో డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ తతంగాన్ని వీడియో తీసినట్లు తేలింది. 
 
కానీ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ రాజ్ అనే మరో పేరున్న శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై అతని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోనులో అతడు ఆరుగురు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలు వుండటం గమనించారు. ఇందులో ఓ కాలేజీ స్టూడెంట్ కూడా వుండటం తెలియవచ్చింది. ఇతడో సీరియల్ రేపిస్ట్ అని తేలడంతో అతనిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు.