దొంగతనం కోసం వెళ్లి.. ఉయ్యాలలో ఊగుతూ ఎంజాయ్ చేశాడు.. సైకోనా? (వీడియో)
ఉయ్యాల అంటే అందులో ఊగుతూ గడపటం అంటే చాలామందికి ఇష్టమనే చెప్పాలి. అయితే ఓ దొంగ దొంగతనానికి వెళ్లి.. అక్కడ ఓ ఉయ్యాల వుంటే దానిపై కూర్చుని ఊగుతూ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, విళుప్పురంకు చెందిన సుధాకర్ నగర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఇళంగోవన్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు.
బాగా టిప్ టాప్‌గా రెడీ అయి దొంగతనానికి వెళ్లాడు. అక్కడ ఒకటే చీకటిగా వుండటంతో మొబైల్ ఫోనులో టార్చ్ లైట్ వేసుకుని దొంగలించాడు. అక్కడ ఏం దొంగలించాడో ఏమో కానీ బయట అతని కంటికి ఉయ్యాల కనిపించింది.
దానిపై కాసేపు అలా హాయిగా ఉయ్యాలలో ఊగుతూ కనిపించాడు. కానీ ఆ ఇంట్లో దేన్నీ దోచుకోలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతడో సైకో అని వీడియోలో ఓ వాయిస్ వినిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.