ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (09:53 IST)

అమెరికాలో కాల్పుల కలకలం వైట్‌హౌస్‌కు సమీపంలో...

అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌కు సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. 
 
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వైట్‌హౌస్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలంబియా హైట్స్ నైబర్ హుడ్ ప్రాంతంలో నిన్న రాత్రి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 
ఇటీవలి కాలంలో అమెరికాలో గన్ సంస్కృతి పెరిగిపోతున్న విషయం తెల్సిందే. గత కొంతకాలంగా పలువురు దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు. షాపింగ్ మాల్స్, పాఠశాలలను లక్ష్యంగా చేసుని ఈ కాల్పులకు పాల్పడుతున్నారు.