ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (15:37 IST)

ఇండో-అమెరికా ఆర్మీ.. అదరగొట్టే స్టెప్పులు.. (వీడియో)

అగ్రరాజ్యం అమెరికా, భారత్‌లు ''యుద్ధ అభ్యాస్'' పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్-అమెరికా సైన్యం మాత్రం కలిసి హ్యాపీగా గడిపారు. 
 
అమెరికా-భారత సైనికులు కలిసి అస్సాం రెజిమెంట్ మార్చింగ్ సాంగ్‌కు స్టెప్పులేశారు. ''బద్లూరామ్ కా బంధన్ జమీన్ కే నీచే హై'’ను అంటూ ఇరు దేశాల సైన్యం అద్భుతంగా పాడారు. 
 
అంతేకాదు దానికి తగ్గట్టుగా కాళ్లు కదుపుతూ, క్లాప్స్ కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇరుదేశాల సైనికులు ఈ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.