శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (11:46 IST)

యుద్ధంలో ఓడిపోయినా.. అణుయుద్ధంలో మాత్రం సత్తా చాటుతాం...

భారత్‌తో సంప్రదాయ యుద్ధమే చేయాల్సి వస్తే.. పాకిస్థాన్ ఓడిపోయే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. సాధారణ యుద్ధంలో తాము ఓడిపోయినా, అణుయుద్ధంలో మాత్రం సత్తా చూపుతామంటూ ఇమ్రాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. 
 
కానీ యుద్ధం అంటూ జరిగితే, రెండు దేశాలూ అణ్వస్త్రాలను ఉపయోగిస్తాయని.. అదే జరిగితే.. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాను యుద్ధాన్ని కోరుకోవడం లేదని అంటూనే ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
ఇప్పటికే కాశ్మీర్ విషయంలో, ఆర్టికల్ 370 రద్దు అంశంలో అంతర్జాతీయ మద్దతు తమకు లేదని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. ప్రస్తుతానికి యుద్ధం జరిగితే.. పాకిస్థాన్‌కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.