ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (14:08 IST)

చేతిని ముద్దాడిని అనుష్క... ఎమోషనల్‌ అయిన కోహ్లీ (Video)

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. తన చేతిని భార్య అనుష్క ముద్దాడిన వేళ ఆయన ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గురువారం ఢిల్లీలో డీడీసీఏ కార్యక్రమం జరిగింది. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు.. మరికొందరు క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా అంతర్జాతీ క్రికెట్ స్టేడియానికి ఇటీవల అనారోగ్యంతో మరణించిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరును పెట్టారు. అలాగే, స్టేడియంలోని ఓ స్టాండ్‌కు విరాట్ కోహ్లీ పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. 
 
ఆ సంద‌ర్భంలో విరాట్ ప‌క్క‌న కూర్చున్న అనుష్క అత‌ని చేతిని ముద్దాడి చాలా ఎమోష‌న‌ల్ అయింది. ఆ స‌మ‌యంలో విరాట్ కూడా భావోద్వేగానికి గురై అనుష్క చేతిని గట్టిగా ప‌ట్టుకున్నాడు. ఈ స‌న్నివేశం కెమెరాల‌లో రికార్డ్ కాగా, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. 
 
విరాట్ కోహ్లీ ఈ నెల 15వ తేదీ నుంచి ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న సిరీస్ కోసం సిద్ధం అవుతున్నాడు. ఇక అనుష్క "జీరో" సినిమా త‌ర్వాత ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయ‌క‌పోగా, త‌న భ‌ర్త‌తో క‌లిసి ఆనంద క్ష‌ణాలు గడుపుతుంది.