గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (11:46 IST)

అభిప్రాయ బేధాలను వివాదాలుగా చూడకూడదు.. రవిశాస్త్రి

విరాట్ కోహ్లీ-రోహిత్ వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. వరల్డ్ కప్ ముగియగానే విరాట్ కోహ్లీ, అనుష్కలను రోహిత్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం సందేహాలకు ఊతమిచ్చింది. దీనిపై తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఓ విషయంలో భేదాభిప్రాయం ఉన్నంత మాత్రాన అది వివాదం అనుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. 
 
ఓ జట్టులో 12మంది వుంటే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం కలిగివుండే అవకాశం ఉందని.. అది అవసరం కూడా. అందరూ ఒకే అభిప్రాయం వెల్లడించాలని తాను కోరుకోనని.. ఓ అంశంపై చర్చ జరిగినప్పుడు జట్టులో ఎవరో ఒకరు సరికొత్త వ్యూహం వెల్లడిస్తే.. దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పాడు. ఏది అత్యుత్తమమో దాన్ని ఖరారు చేస్తామని.. అంతేకాకుండా అభిప్రాయభేదాలను వివాదాలుగా చూడకూడదంటూ వివరణ ఇచ్చుకున్నాడు.