కోచ్ రవిశాస్త్రి వేతనం రూ.6 కోట్లు నుంచి రూ.10 కోట్లకు పెంపు?
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ వార్షిక వేతనం ఏకంగా పది కోట్ల రూపాయలకు పెరగనుంది. ప్రస్తుతం ఆయనకు ఇచ్చే వేతనం రూ.8 కోట్లుగా ఉంది. దీన్ని పది కోట్ల రూపాయలకు పెంచే అవకాశాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రవిశాస్త్రితో పాటు... సహాయక సిబ్బంది వేతనాలు కూడా పెరగనున్నాయి. భరత్ అరుణ్‌రు రూ.3.5 కోట్లు, విక్రమ్ రాథోడ్‌కు రూ.3 కోట్ల వరకు ఇవ్వనున్నారు. ఇటీవలే ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రికి రెండేళ్ల పొడిగింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా, జట్టు నిలకడగా రాణించే విధంగా చూస్తూ, యువకులకు అవకాశం ఇవ్వడమే తన ముందున్న కర్తవ్యమని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. అలాగే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2020లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లపై దృష్టిసారించినట్టు రవిశాస్త్రి వెల్లడించారు.