శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (13:26 IST)

భారత క్రికెటర్ల భార్యలు తన్నుకున్నారా? శాస్త్రి ఏమంటున్నారు?

ఇటీవల ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో భారత క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొన్నారు. అలాగే, వారివారి భార్యలు కూడా క్రికెటర్లతో ఉండేందుకు బీసీసీఐ అనుమతిచ్చింది. అయితే, ఇపుడు సరికొత్త రూమర్ ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
భారత క్రికెటర్ల భార్యలు కొట్టుకున్నట్టు ఆ రూమర్ సారాంశం. ఈ కారణంగా క్రికెటర్ల భార్యల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయని పలు కథనాల్లో వచ్చాయి. వీటిపై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. 
 
వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా బయలుదేరింది. ఈ  సందర్భంగా రవిశాస్త్రి ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతూ, ఇవన్నీ అసత్య వార్తలు అని కొట్టిపడేశారు. రానున్న రోజుల్లో ఆటగాళ్ల భార్యలు బ్యాటింగ్ చేస్తున్నారని, బౌలింగ్ చేస్తున్నారనే వార్తలను కూడా చదవాల్సి వస్తుందేమోనని సెటైర్ వేశారు. 
 
మన జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఎలాంటి వివాదాలు చోటుచేసుకోలేదని చెప్పారు. క్రికెట్ కంటే ఏ ఆటగాడు గొప్ప కాదని రవిశాస్త్రి అన్నారు. తాను కానీ, ఏ ఆటగాడైనా కానీ గొప్ప కాదని చెప్పారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోందని అన్నారు. ప్రపంచకప్‌లో కూడా మన జట్టు అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని చెప్పారు. 
 
గత 18 నెలల్లో టెస్టుల్లో అద్భుతంగా రాణించామని, వన్డేల్లో పరుగుల వరద పారించామని తెలిపారు. టెస్టుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని, వన్డేల్లో నెంబర్ టూగా ఉన్నామని, టీ20ల్లో కొంత మెరుగు పడాల్సి ఉందని చెప్పారు. ప్రపంచకప్‌లో గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని... ఓడినంత మాత్రాన మన ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువ చేసి మాట్లాడలేమని అన్నారు.