సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 13 జనవరి 2019 (14:02 IST)

బోనస్ కోసం భార్యాభర్తల కీచులాట.. కొడవలితో గొంతుకోసిన భర్త

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇస్తున్న సంక్రాంతి బోనస్ పలువురి ప్రాణాలు తీస్తోంది. సంక్రాంతి కానుక నగదులో భాగం ఇవ్వలేదని ఓ చెల్లిని అన్న హత్య చేశాడు. అలాగే, ఇపుడు ఓ భర్త తన భార్యను చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదురై జిల్లా ఏళుమలై అనే గ్రామంలో ఆర్ రాజమ్మాళ్ (68)కు తెల్ల రేషన్ కార్డు ఉండటంతో ఆమెకు ప్రభుత్వం రూ.1000 సంక్రాంతి కానుకను అందజేసింది. ఇందులో తనకు కూడా భాగం ఇవ్వాలని భర్త రామన్ అడిగాడు. 
 
అందుకు ఆమె నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. క్షణికావేశంలో భార్యను కొడవలితో భర్త హత్య చేశాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.