కన్న కూతురుపై రేప్... సోదరులను కూడా పిలిచి గ్యాంగ్ రేప్...

rape victim
Last Modified మంగళవారం, 8 జనవరి 2019 (12:38 IST)
రానురాను మనషుల్లో కొందరు పశువులుగా మారిపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి తన కన్ను కూతురుని కాటేసిన దారుణమైన ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు సంవత్సరాలుగా తన కుమార్తెపై నిత్యం అత్యాచారం చేస్తున్న ఈ కామాంధుడు, తన సోదరులను పిలిచి వారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపారు. కోయంబత్తూరులో చదువుకుంటున్న ఓ విద్యార్థిని లైంగిక వేధింపుల అవగాహన కార్యక్రమంలో ఈ విషయం బయటపెట్టింది. తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి బాలిక చెపుతుంటే అధికారులు షాక్ తిన్నారు. తనపై తన తండ్రి, చిన్నాన్నలిద్దరూ గత 2016 నుంచి అత్యాచారం చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. దీనితో అధికారులు వెంటనే స్పందించి సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో నిందితులను అరెస్టు చేశారు.దీనిపై మరింత చదవండి :