ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:17 IST)

200 మంది పైలట్లతో ఒప్పందాలు తాత్కాలిక రద్దు : ఎయిరిండియా

కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో... ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సుమారు 200 మంది పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా రద్దు చేసింది.

సంస్థ అవసరాల రీత్యా ఉద్యోగ విరమణ పొందిన 200 మంది పైలట్లను అంతర్జాతీయ, దేశీయ విమానాలు నడపడానికి పున: నియమించింది.

ఈ మేరకు వీరితో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈ నెల 14 వరకు రద్దు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని వారాలుగా విమానాలను నడవకపోవడంతో రెవెన్యూ పూర్తిగా పడిపోవడంతోనే వీరిని తొలగించామని, మళ్లీ పరిస్థితులు కుదుటపడిన తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంటామని వెల్లడించింది.