బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (11:43 IST)

యుపిలో ఘోర రోడ్డుప్రమాదం.. పది మంది మృతి

యుపిలోని మోర్దాబాద్‌ - ఆగ్రా రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మినీ బస్సు - ట్రక్కు   ఢీ  కొన్నాయని, ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై యుపి సిఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాఖను ఆదేశించారు.