గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 2 జనవరి 2016 (12:14 IST)

పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రవాదుల దాడి: గట్టిగా బదులిస్తామన్న రాజ్‌నాథ్.. మోడీ భేటీ..!

పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రవాదుల దాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఉగ్రవాదులు ఎవరు దాడి చేసినా వాటికి గట్టిగా బదులిస్తామని తెలిపారు. పొరుగు దేశం పాకిస్థాన్‌తో శాంతి కోరుకుంటున్నామని, ఉగ్రవాదులు ఎవరైనా దాడి చేస్తే తీవ్రంగా తిప్పికొడుతామని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదుల ప్రయత్నాలను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులపై రాజ్‌నాథ్ ప్రశంసలు కురిపించారు. జవాన్లు కనబరిచిన ధైర్యసాహసాల పట్ల గర్వంగా ఉందన్నారు.
 
అలాగే భారత్‌లో ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ప్రాబల్యం పెరగకుండా ఉండడంలో ముస్లిం కుటుంబాల పాత్ర ఎంతో ఉందని రాజ్ నాథ్ సింహగ్ వ్యాఖ్యానించారు.  దేశంలోని ముస్లిం కుటుంబాల విలువలకు గర్విస్తున్నానని అన్నారు. పిల్లలు ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల భావజాలానికి ఆకర్షితులు కాకుండా కుటుంబ సభ్యులు చూస్తున్నారని కొనియాడారు.
 
మరోవైపు పంజాబ్ పఠాన్ కోట్ ఎయిర్ బస్‌పై చేసిన ఉగ్రదాడిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం తన కేబినెట్‌లో ముఖ్యులతో భేటీ కానున్నారు.  కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం.

దాడికి సంబంధించి సమగ్ర వివరాలను ఈ సమావేశం మందు పెట్టే బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారుకు అప్పగించారు. దీంతో శనివారం ఉదయమే రంగంలోకి దిగిన ఆయన దాడికి సంబంధించి సమగ్ర వివరాలను సేకరించే పనిలో పడ్డారు.