శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2016 (11:24 IST)

జికా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు.. డబ్ల్యూహెచ్‌వో

స్వైన్ ఫ్లూ, చికెన్‌గున్యా, బర్డ్‌ఫ్లూ, డెంగ్యూ, ఎబోలా గురించి మరిచిపోకముందే జికా వైరస్‌ ప్రస్తుతం అన్ని దేశాలను గడగడలాడిస్తోంది. జికా వైరస్‌ గురించి తీవ్ర భయాందోళనలకు గురై బెంబేలెత్తి పోవలసిన అవసరం ల

స్వైన్ ఫ్లూ, చికెన్‌గున్యా, బర్డ్‌ఫ్లూ, డెంగ్యూ, ఎబోలా గురించి మరిచిపోకముందే జికా వైరస్‌ ప్రస్తుతం అన్ని దేశాలను గడగడలాడిస్తోంది. జికా వైరస్‌ గురించి తీవ్ర భయాందోళనలకు గురై బెంబేలెత్తి పోవలసిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. జికా మూలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యంత ప్రమాదరకమైన పరిస్థితి ఏమీ ప్రస్తుతానికి లేదనీ.. అయితే, ఇప్పటికీ జికా వైరస్‌ ద్వారా వ్యాధివ్యాప్తి మాత్రం పెనుసవాలేనని స్పష్టం చేసింది.
 
జికా వైరస్‌కు పుట్టిల్లుగా పేర్కొనే బ్రెజిల్‌ మాత్రం డబ్ల్యూహెచ్‌వో వాదనను ఖండిస్తోంది. జికా వైరస్‌ వ్యాప్తిని తాము ప్రమాదకరమైన అత్యవసరంగా మాత్రమే పరిగణిస్తామని స్పష్టం చేసింది. జికా వైరస్‌ దీర్ఘకాలిక సమస్యే అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో భయాందోళనలకు గురికావలసినంత పెద్ద ప్రజారోగ్య సమస్య మాత్రం కాదని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర సంఘం సారథి డాక్టర్‌.డేవిడ్‌ హేమన్‌ తెలిపారు.