పని లేకున్నా అర్ధరాత్రి వరకూ మేల్కొనే ఉంటున్నారా.. అయితే మరణమే శరణం
నిద్రాదేవి నిను వరించె గదరా నిర్భాగ్య దామోదరా అని పద్యం ఉంది. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా నిదురపోరా తమ్ముడా, నిదురు పోవే చెల్లెలా అంటూ జోలపాట పాడి వినిపించాల్సిన అవసరం ముంచుకొచ్చింది. నిద్ర లేమితో నిద్రకు దూరమైన రోజుల స్థానంలో నిద్రను ఆపుకుంటున
నిద్రాదేవి నిను వరించె గదరా నిర్భాగ్య దామోదరా అని పద్యం ఉంది. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా నిదురపోరా తమ్ముడా, నిదురు పోవే చెల్లెలా అంటూ జోలపాట పాడి వినిపించాల్సిన అవసరం ముంచుకొచ్చింది. నిద్ర లేమితో నిద్రకు దూరమైన రోజుల స్థానంలో నిద్రను ఆపుకుంటున్న రోజులు వచ్చేశాయి. అవును జాతి భవిష్యత్తుకు మూలకందంగా నిలవాల్సిన యువతరం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల బారినపడి నిద్ర మర్చిపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుతోందంటే యువత మరణాన్ని స్వయంగా ఆహ్పానిస్తున్నారు.
ఎయిమ్స్ విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం.. ఢిల్లీలో ఏకంగా 70 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో యువత సైతం ఎక్కువగానే ఉన్నారు. రోజుకు 7 గంటలు నిద్రపోయిన వారిలో మరణశాతం రేటు తక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అలాగే 6 గంటల కంటే తక్కువ 8 గంటల కంటే ఎక్కువ పడుకున్నా.. 15 శాతం మరణరేటు పెరుగుతోందని గుర్తించారు.
నిద్రను ఆపుకుని మరీ ఐఫోన్లలో రాత్రంతా గడిపే యువత మరుసటి రోజు మందకొడిగా మారిపోతారు. వారు సరిగ్గా గంట నిలబడలేరు.. కూర్చోలేరు.. తరగతి గదిలో ఓ గంట పాఠం వినడమే గగనమే. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. జ్ఙాపకశక్తి తగ్గిపోతుంది. వీరికి తలనొప్పి, ఒంటినొప్పులు నిత్యకృత్యం. వీటిని తగ్గించుకునేందుకు నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటారు. ఇది కడుపులో మంటకు దారితీస్తుంది. దానిని తగ్గించుకునేందుకు ఏదైనా తినేస్తుంటారు. ఇది ఒబిసిటికి దారి తీస్తుంది.
ప్రధానంగా నిద్రలేమి వల్ల శరీర కాలచక్రం గతి తప్పుతుంది. దీనివల్ల ఏ సమయానికి చేయాల్సిన పనులు.. ఆ వేళకు జరగవు. ఏకాగ్రత లోపిస్తుంది. కళ్లు ఎర్రబడతాయి. కళ్లు లోపలికి పోయి.. దురదలు వస్తాయి. నీరు కారుతుంటాయి. నిద్రలేమి వల్ల వినికిడి శక్తి సైతం తగ్గిపోతుంది. ఉత్సాహం తగ్గిపోతుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. సరైన సమయానికి మలమూత్ర విసర్జన సైతం జరగదు. అందుకే నిద్ర అన్నింటికీ ప్రధానమని గుర్తించాలి.
ప్రస్తుతం యువతరాన్ని బానిసలుగా మార్చేస్తున్న అతి పెద్ద సమస్య అంతర్జాల వినియోగం, స్మార్ట్ ఫోన్ ఫీవర్. వీటి కోసం నిద్రను మానుకుని ఫోన్‌తోనే అర్ధరాత్రి వరకూ గడిపేస్తున్నారు. నిద్రపోయే సమయాన్ని అలా.. అలా... రాత్రి 10.. 11... 12.. ఒంటి గంట ఇలా పెంచుకుంటూ పోతున్నారు. ఇది మరణానికి అతి దగ్గర బాటను వారికి చూపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.