మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 15 జూన్ 2024 (13:03 IST)

డిజిటల్ ఇండియా ఇదే.. ఓ డ్యాన్సర్ ఆలోచనలకు నెటిజన్లకు ఫిదా! (Video)

dancer qr code
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం మొదలైంది. ముఖ్యంగా, కరోనా సమయంలో నగదు బదిలీ కోసం ఈ విధానం ఎంతగానో ఉపయోగపడింది. తొలుత ఈ విధానానికి అలవాటుపడటానికి దేశ ప్రజలు తీవ్ర అసౌకర్యంగాను, తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు. కాలక్రమంలో బాగా అలవాటైపోయారు. చివరకు టీ తాగేందుకు కూడా డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. 
 
ఇపుడు రూపాయి నుంచి మొదలుకొని వేల రూపాయల వరకు అన్నీ డిజిటల్ విధానంలోనే జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఉండే కూరగాయల షాపుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నీ డిజిటల్ పేమెంట్సే. ఇక, జూపార్కులు, టీటీడీ దేవస్థానం, ఇతర ప్రభుత్వ సంస్థలు అయితే నగదును తీసుకోవడం పూర్తిగా మానేశాయి. దీంతో డిజిటల్ విధానం అనివార్యమైంది. 
 
నగదు రహిత లావాదేవీల విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో ముందుంది. ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే డిజిటల్ ఇండియా ఎంతగా పురోగమిస్తుందో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఓ డ్యాన్సర్ స్టేజిపై డ్యాన్స్ చేస్తూ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని క్యూఆర్ కోడ్‌ను చూపిస్తుంది. ఆమె నృత్యానికి మెచ్చి డబ్బులు ఇవ్వాలనుకునే వారు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఇవ్వాలనుకున్న మొత్తాన్ని పంపిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు మాత్రం తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ ఇండియా అంటే ఇదే అని కొందరు కామెంట్ చేస్తే.. మోడీ కోరుకున్న డిజిటల్ ఇండియా ఇదేనని మరికొందరు అంటున్నారు. ఆ డ్యాన్సర్‌కు వచ్చిన ఆలోచనకు మరికొందరు ఫిదా అయితే, ఇంకొందరు డిజిటల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను నియమించాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి.