మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 జులై 2018 (09:06 IST)

అక్కడ అద్దెకు భార్యలు.. స్టాంపు పత్రాలపై ఒప్పందం కూడా...

భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఒకటి మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలో అద్దెకు భార్యలు లభిస్తున్నారు. ఈ దారుణం కొన్ని దశాబ్దాల నుంచి సాగుతున్నా పట్టించుకునే నాథుడేలేడు. పైగా, ఈ దారుణంపై ఫిర్యాదు చేసేందుకు ఏ ఒ

భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఒకటి మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలో అద్దెకు భార్యలు లభిస్తున్నారు. ఈ దారుణం కొన్ని దశాబ్దాల నుంచి సాగుతున్నా పట్టించుకునే నాథుడేలేడు. పైగా, ఈ దారుణంపై ఫిర్యాదు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలో ఇది కొనసాగుతోంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శివపురి జిల్లాలోని దధీచ ప్రాత అనే సంప్రదాయం పురాతనకాలం నుంచి ఉంది. ఈ ఆచారం మేరకు తన భార్యను ఇతర వ్యక్తులకు భర్త అద్దెకు ఇవ్వడం లేదా విక్రయించుకొనే వెసులుబాటు ఉంది. ఇందుకోసం భర్తతో పాటు అతని భార్యను కొనుగోలు లేదా అద్దెకు తీసుకునే వ్యక్తి ఒక ఒప్పందం కుదుర్చుకుని స్టాంపు పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. 
 
ఈ ఒప్పందంలో భార్యను విక్రయించిన భర్తకు ఎంత ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తే అంత ఎక్కువకాలం కొనుగోలుదారుడి వద్ద ఉంచుకోవచ్చు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిర్ధారించడానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది.