మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 6 జులై 2018 (19:26 IST)

భర్త ఇంట్లో వుండగానే బోయ్ ఫ్రెండ్‌తో శృంగారం... తల్లిదండ్రులకే దొరికిపోయిన మహిళ....

కట్టుకున్న భర్త తాగుడుకు బానిసై తనకు లైంగిక సుఖం ఇవ్వడం లేదన్న కోపంతో ఒక భార్య ఎంత దిగజారిందో ఈ సంఘటన చదివితే అర్థమవుతుంది. పెళ్ళయి ఆరు నెలలవుతున్నా భర్త పట్టించుకోకపోవడం, మద్యానికి బానిసై ఇంటికొచ్చి రోజూ తనను కొడుతుండటం... ఇలా ప్రత్యక్ష నరకాన్ని అను

కట్టుకున్న భర్త తాగుడుకు బానిసై తనకు లైంగిక సుఖం ఇవ్వడం లేదన్న కోపంతో ఒక భార్య ఎంత దిగజారిందో ఈ సంఘటన చదివితే అర్థమవుతుంది. పెళ్ళయి ఆరు నెలలవుతున్నా భర్త పట్టించుకోకపోవడం, మద్యానికి బానిసై ఇంటికొచ్చి రోజూ తనను కొడుతుండటం... ఇలా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన భార్య అతడితో విసిగిపోయి పక్కదారి పట్టింది. వివరాలు ఇలా వున్నాయి.
 
హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని పారిశ్రామికవాడలో నివాసముంటున్న దిలీప్, రమ్యలకు ఆరు నెలల క్రితం వివాహమైంది. దిలీప్ స్థానికంగా ఒక ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్ళి కాక ముందు నుంచి దిలీప్‌కు మద్యం అలవాటు వుంది. పెళ్ళయిన తరువాత కూడా రోజూ అది మరింత ఎక్కువైంది. పూటుగా మద్యం తాగి వచ్చి భార్యను హింసించేసేవాడు. ఆరు నెలల పాటు భార్య రమ్య భర్త వేధింపులను తట్టుకుంది. వేధింపులతో పాటు శారీరక సుఖం లేకపోవడంతో కుంగిపోయింది. దీంతో చేసేది లేక తన బాయ్‌ఫ్రెండ్లను లైన్లో పెట్టింది. అలా మొత్తం ఆరుగురితో ఇంటిలోనే మకాం వేసింది. 
 
భర్త దిలీప్ మద్యం సేవించి వస్తే అతనికి ఇంట్లోనే రమ్య మరికొన్ని బాటిళ్ల మద్యం ఇచ్చి అతడికి పీకలదాకా మద్యం తాగించేది. బాగా తాగి దిలీప్ మత్తులో పడిపోయిన తరువాత బాయ్ ఫ్రెండ్లకు ఫోన్ చేసి పిలిపించుకుని తన పని ఇంట్లోనే కానిచ్చేసేది. ఇలా ఆరుగురు బాయ్ ఫ్రెండ్లను 25 రోజుల పాటు ఇంటికి పిలిపించుకుంది. ఇలా రమ్య వ్యవహారం జరుగుతుండగా ఆమె తల్లిదండ్రులు ఒకరోజు ఇంటికి వచ్చారు. వారి రాక విషయం ఆమె తెలియకపోవడంతో రమ్య తన బాయ్ ఫ్రెండుతో అలా చేస్తున్న వ్యవహారాన్ని కళ్ళారా చూశారు. మరోవైపు అపస్మారక స్థితిలో పడి ఉన్న అల్లుడిని లేపి విషయం చెప్పారు. రమ్య తల్లిదండ్రులే నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి తమ కుమార్తెను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.